హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆయన స్వగృహంలో కన్నుమూశారు. పలువురు సీనియర్ నాయకులు, వివిధ పార్టీల నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారు. అయితే ఆయన గత 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Must Read ;- టీడీపీ మాజీ మంత్రి కన్నుమూత : చంద్రబాబు సంతాపం