భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. రాజస్థాన్ లో ఆయన కుటుంబం సహా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికిఈ గురై బోల్తా పడింది. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కార్లో ఉన్నారు. కారు బోల్తా పడి దెబ్బ తింది. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు.
రాజస్థాన్ లోని రాన్ తంబోర్ కు కుటుంబ సమేతంగా వెళుతుండగా కారు ప్రమాదానికి గురైంది. అజర్ కుటుంబ సభ్యులను వేరే కార్లో హోటల్ కు తరలించారు.
అజారుద్దీన్ గత వారం అహ్మదాబాద్ లో ఉన్నారు. హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో బీసీసీఐ సమావేశానికిఈ హాజరు అయ్యారు. ఇంతలో రాజస్థాన్ లో ఈ ప్రమాదం జరిగింది. అజారుద్దీన్ వెంట ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
Also Read: త్వరలో హైద్రాబాద్ లో ల్యాండ్ కానున్న ‘రాధేశ్యామ్’ బృందం