ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,582 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 22 మంది మృతి చెందారు. 2,343 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి చేరారు. అదే సమయంలో అత్యధికంగా చిత్తూరులో గడిచిన 24 గంటల్లో 1, 171 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 804, కర్నూలులో 729, శ్రీకాకుళం 912 కేసులు నమోదు అయ్యాయి. ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కి చేరింది. కొత్తగా 1,501 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 1,77,150కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతానికి పెరిగింది. తాజాగా 1,38,423 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,28,09,643కి చేరింది. రికవరీ రేటు 86.6 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 12 కోట్ల 26 లక్షల 22వేల 590 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ నిల్వలు నిండుకోవడంతో నిన్న తెలంగాణ అంతటా వ్యాక్సినేషన్ బంద్ చేశారు. మళ్లీ ఇవాళ వ్యాక్సినేషన్ మొదలుకానుంది. ఈ మేరకు తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ కరోనాపై సమీక్ష జరిపారు. రోగులు అధైర్యపడవద్దని, ఆస్పత్రిలో బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు, త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Must Read ;- డబుల్ మాస్క్ తో కరోనాకు చెక్











