కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే, హత్యకు గురైన సుబ్బయ్య భార్య అనుమానిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్ మెరుపు నిర్ణయం తీసుకున్నారు. సుబ్బయ్య హత్య కేసులో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డి , ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని పోలీసులకు తేల్చి చెప్పారు. వైసీపీ నేతల దందాలు, అరాచకాలను బయటపెట్టినందుకే సుబ్బయ్యను హత్య చేశారని లోకేష్ ఆరోపించారు.
ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు
వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డి సుబ్బయ్యను హత్య చేయించారని ఆయన భార్య అపరాజిత టీడీపీ నేత నారా లోకేష్‌కు వివరించారు. అయినా వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆమె వాపోయారు. దీంతో నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్లన్నీ ఎఫ్‌ఐ ఆర్‌లో నమోదు చేసే వరకు సుబ్బయ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదని లోకేష్ తేల్చి చెప్పారు. జిల్లా టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులతో మెరుపు ఆందోళనకు దిగారు. దీంతో ప్రొద్దుటూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: kadapa tdp