మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఖరారైంది. త్వరగా మా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి పెరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ విషయం క్రమశిక్షణ సంఘం దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్నారు. మొదట్లలో సెప్టెంబరు 26న ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఈ తేదీని అక్టోబరు 10గా నిర్ణయించారు.
ఎన్నికలు త్వరగా నిర్వహించాలని మెగాస్టార్ చిరంజీవి కూడా క్రమశిక్షణ సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్వవహారంలో మా సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు, మురళీ మోహన్ దీనిపై చర్చించి ఎట్టకేలకు అక్టోబరు 10న ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల తేదీ ఖరారు కావడంతో ఎవరెవరు బరిలో ఉంటారన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటికే కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. రేపటి నుంచి కొత్త పేర్లు కూడా వినిపించవచ్చు. ఎన్నికల బరిలోకి దిగే వారు తమ ప్యానల్స్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ప్రకాష్ రాజ్ మాత్రమే తమ ప్యానల్ ప్రకటించారు. అక్టోబరు 10 వ తేదీపైన కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
Must Read ;-‘మా’ ఎన్నికల బరిలోకి కాదంబరి కిరణ్