మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు నోటిఫికేషన్ రాకుండానే.. ఇంకా చెప్పాలంటే.. మూడు నెలల ముందు నుంచే అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సివిఎల్ నరసింహారావు పోటీపడుతున్నట్టుగా ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ఒక అడుగు ముందుకు వేసి తన ప్యానల్ ను కూడా ప్రకటించడం జరిగింది. ఇక మంచు విష్ణు అయితే.. మా కి భవనాన్ని తన సొంత ఖర్చులతో తనే కడతానన్నారు. అలా చెప్పడమే కాకుండా.. మా భవనం కోసం మూడు స్థలాలను చూడడం కూడా జరిగింది.
ఇలా.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నువ్వా నేనా అన్నట్టుగా పోటీకి సై అంటున్నారు. ఇక జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు సైలెంట్ గా ఉన్నారు. అయితే… ఇప్పుడు మా ఎన్నకల రంగంలోకి మేము సైతం కాదంబరి కిరణ్ దిగుతున్నారు. తాను కూడా మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నాను అని ప్రకటించడంతో మరింత ఆసక్తిగా మారింది. అంతే కాకుండా.. తనకు అందరి సపోర్టు ఉందని తప్పకుండా గెలుస్తాను అని చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా.. ఎలా గెలుస్తానంటున్నానో అంటూ ఓ లెక్క కూడా చెబుతున్నారు.
ఆ లెక్క ఏంటంటే.. మొత్తం 900 పైచిలుకు ఓట్లలో గత ఎన్నికల్లో 450 ఓట్లు పోలయ్యాయి. ఈసారి కూడా 450 ఓట్లు పోలైతే… అందులో 300 ఓట్లు తనకు పడతాయని.. తన గెలుపు ఖాయమని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. తానీ విషయాన్ని ఓవర్ కాన్ఫిడెన్సుతో చెప్పటం లేదని.. ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత మీకే తెలుస్తుంది చూడండంటూ వ్యాఖ్యానించటం విశేషం. మేము సైతం.. అంటూ ఆపదలో ఉన్న కళాకారులను ఆదుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు కాదంబరి. ఆయన.. బరిలోకి దిగుతానని ప్రకటించటంతో మా ఎన్నికల వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.
Must Read ;- మా భవనం కోసం స్థలం చూసి.. మరోసారి వార్తల్లో నిలిచిన విష్ణు.