Prakash Raj In Mani Ratnam’s Magnum Opus Ponniyin Selvan Movie :
ప్రకాష్ రాజ్ ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ వెళ్లారండోయ్. ఎందుకో తెలుసా? అందులో అమితాబ్ పోషించాల్సిన పాత్రను ఇప్పుడు ప్రకాష్ రాజ్ పోషించాల్సి వస్తోంది. దర్శకనిర్మాత మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ తాజ్ అప్ డేట్ ఇది. 1955 లో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది పీరియాడికల్ మూవీ. భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. ఇందులో నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ కోసం వెళుతూ మణిరత్నం, హీరో కార్తి, నటుడు ప్రకాష్ రాజ్ గ్వాలియర్ విమానాశ్రయంలో ఫొటో దిగారు. దాన్ని ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 16, 17 శతాబ్దాలలో నిర్మించిన కోటలు, దేవాలయాలు మధ్యప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని ఓర్చా పట్టణంలో ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. అక్కడికి చిత్రబృందం చేరుకుంది. ఇటీవల పాండిచ్ఛేరిలో కొంత షూటింగ్ చేశారు. ఓర్చాలో ఈ నెల 19 నుంచి 15 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఈ షెడ్యూల్ లో ఫోర్ట్ ఓర్చాలో ప్రధాన ప్యాలెస్ లోనూ, ఫోర్ట్ గార్కుంధర్, గ్వాలియర్ కోట, మహేశ్వర్ లో చిత్రీకరణ జరుపుతారు. ఇందులో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్ నటిస్తున్నారు. నందిని లేదా మందాకినీ దేవి పాత్రను ఐశ్వర్యారాయ్ పోషిస్తోంది. పొన్నియన్ సెల్వన్ పాత్రను జయం రవి పోషిస్తున్నారు.
సుందర చోజార్ పాత్ర కోసం ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ అని అనుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఎందుకు ఇలా రీప్లేస్ చేయాల్సి వచ్చిందో తెలియదు. పోన్నియన్ సెల్వన్ అసలు పేరు అరుల్ మోళి వర్మన్. అతని తొలిరోజుల కథ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. ఆ తర్వాత అతను చోళ చక్రవర్తి అయిన రాజరాజచోళుడు అయ్యారు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగానే విడుదలవుతుంది. మొదటి భాగం వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలవుతుంది.
Must Read ;- భారీ మల్టీస్టారర్ గా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్