మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు పోటీ చేయనున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. మా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మా భవనం ప్రచారాస్త్రంగా నిలుస్తుంది. ఈసారి మంచు విష్ణు మా భవనాన్ని తనే సొంత ఖర్చులతో కడతానని ప్రకటించారు. అయితే.. మా ఎన్నికలు ఎప్పుడో ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరు గెలుస్తారో కూడా తెలియదు కానీ.. మంచు విష్ణు మా భవనం కడతాను అని చెప్పిన మాటలను నిజం చేసే పనిలో బిజీగా ఉన్నారు. అవును.. మా భవనం స్థలం చూసే పనిలో మంచు విష్ణు బిజీగా ఉన్నారు.
తాజాగా బిల్డింగ్ నిర్మాణానికి మూడు చోట్ల స్థలాలు చూసినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. మా భవనం మన అందరి కల. అది త్వరలోనే నెరవేరబోతుంది. నేనే స్వయంగా వెళ్లి మూడు స్థలాలను చూశా. వాటిలో ఏది అనుకూలంగా ఉంటుందనే అందరం కూర్చుని నిర్ణయిద్దాం. త్వరలోనే మన కల నెరవేరనుంది అని ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే… మా కోసం ప్రత్యేకంగా స్థలం అవసరం లేదని, హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోనే మరో బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలం ఉందని, కొంత మంది సినీ పెద్దలు సలహా ఇస్తున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో కొంత ఖాళీ స్థలం ఉంది. అక్కడ మా భవనం కడితే.. చిత్రసీమకు చెందిన అన్ని వ్యవస్థలూ ఒకే చోట ఉన్నట్టుంటుంది. అయితే.. మా భవనాన్ని ఏదో చిన్న భవనంలా కాకుండా అన్ని వసతులతో భారీ భవనంలా కట్టాలనుకుంటున్నారట సినీ పెద్దలు. విష్ణు దీనిని సీరియస్ గా తీసుకుని స్థలం చూస్తున్నారు. విష్ణు స్పీడు చూస్తుంటే.. మా భవనం అనే కల నెరవేరేట్టే అనిపిస్తుంది.
Must Read ;- ‘మా’తో పెట్టుకుంటే మడతడిపోద్దా?