సినిమా తారలంతా దీపావళి సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. అటు బాలీవుడ్, ఇటు తెలుగు, తమిళ నటులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తన గురువు దర్శకుడు కె. విశ్వనాథ్ ఆశీస్సులు తీసుకుని పండగకు శుభారంగం పలికారు. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి నటులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. వారు కూడా చిన్ని పిల్లల్లా మారి టపాసులు కాల్చారు. వారి కుటుంబ సభ్యులంతా వారితో కలిసి ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. బాలీవుడ్ లో అమితాబ్, అభిషేక్, షారుఖ్ ఖాన్ తదితరులంతా వేడుకలో పాల్గొన్నారు.












