గురువారం తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికలప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక్క లోకసభ స్థానంలో గెలిస్తే టీడీపీ బలపడుతుందన్న ఉద్దేశంతో తాను మాట్లాడడం లేదని, రెండేళ్లలో వైసీపీ అరాచక పాలనను వివరించేందుకే ప్రజల్లోకి వెళ్లున్నామన్నారు. కోదండరాముడి తల తీసేసిన వారిని పట్టుకోవడం మానేసి..పది రోజుల తరవాత తాను అక్కడికి వెళ్తే వైఎస్ జగన్ సర్కారు తనపైకేసు పెట్టిందన్నారు. వైసీసీ ప్రభుత్వంలోని కొందరు రౌఢీల్లావ్యవహరిస్తున్నారని, వారికి భయపడేది లేదని, పరిగెత్తిస్తామని వ్యాఖ్యానించారు. అన్ని వ్యవస్థలను జగన్ సర్కారు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. తిరుపతి లోక్ సభ కు ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తున్నందున తన పర్యటనకు ఆటంకం కల్పించలేదన్నారు. ఇదే అధికార వ్యవస్థ పంచాయతీ ఎన్నికల్లో ఎలా వ్యవహరించిందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనకు వైసీపీ పాలనకు తేడాను ప్రజలు గమనించాలని, టీడీపీ హయాంలో అన్ని మతాలను గౌరవించామని, మత సామరస్యాన్ని కాపాడింది టీడీపీయేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే దాడులుచేస్తున్నారని, మా తప్పేదైనా ఉంటే ప్రజలకు వివరించాలి కాని తప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే ఓటుతోనే సాధ్యమన్నారు. వైసీపీ అరాచకాలను చూశాక..మళ్లీ తానే సీఎంగా రావాలని ప్రజలు కోరుతున్నారని, తనకు సీఎం పదవి కొత్త కాదని, పద్నాలుగేళ్లపాటు సీఎంగా చేశానని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైన్స్వ్యా పారమంతా జగన్మోహన్ రెడ్డిదేనని చంద్రబాబు విమర్శించారు. గోరంత చేసి..కొండల్ని దోచేసిన వైసీపీ సర్కారుకు ప్రజలు బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారని, లారీ ఇసుక ధర రూ.10వేలు, ట్రాక్టర్ ఇసుక ధరను రూ.6 వేలకు పెంచారన్నారు. తమ హయాంలో పెట్టుబడులు వచ్చాయని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశామని, పాలనలో పారదర్శకత ఉందని తెలిపారు. వైసీపీ వచ్చాక ధరల నియంత్రణ లేదని, అన్నిధరలూ పెరిగాయని వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధర సెంచరీ కొట్టిందని, వంటగ్యాస్‌పై ఎవరికీ సబ్సిడీ అందడం లేదన్నారు. పిల్లలు చదువుకునే పరిస్థితులు లేకున్నా..వైఎస్ జగన్ ఇంగ్లీషు మాధ్యమం అని మాట్లాడతాడని, వైఎస్ జగన్ సర్కారు వైఖరి వల్ల ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎందుకు మూసేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో నాలుగేళ్లపాటు కరెంటు ఛార్జీలు పెంచలేదని, ఇప్పుడు జగన్ వచ్చాక అన్ని ఛార్జీలూ పెరిగాయన్నారు.
కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి ప్రజలపై మరింత భారం మోపుతారన్నారు. తిరుమల పవిత్రతను కాపాడితేనే భవిష్యత్ ఉంటుందని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఆ బాధ్యత అందరిపైనా ఉందన్నారు. టీడీపీ హయాంలో ఎప్పుడైనా మసీదులు, చర్చిలపై దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఉన్మాద, మాఫియా పాలనలో అన్నీ అరాచకాలే చేస్తున్నారని, తనను నన్ను 10 గంటలు ఎయిర్‌పోర్టులో నిలబెట్టారన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేస్తే జగన్ ఒక్క
అడుగు బయటపెట్టేవాడా అని ప్రశ్నించారు. పనబాక లక్ష్మి అందరికీ తెలుసునని, అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పారు.
Must Read ;- జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్