ప్రభుత్వ విధానాలలో లోపాలు ఉన్నాయని విమర్శలు చేస్తున్న దేవినేని ఉమ తాజాగా మద్యం సరఫరాపై ప్రశ్నించారు. ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. డిపోల నుంచి మద్యం రవాణా చేసేందుకు టెండర్లు పిలిచారని ఓ కథనం ప్రచురించిన ఆ దినపత్రిక 13 జిల్లాలకు కలిపి ఒకే టెండర్ దాఖలైందని తెలిపింది. ప్రస్తుతమవుతున్న ఖర్చు కంటే దాదాపు 60 శాతం ఎక్కువ ధర కోట్ చేసినట్లు సమాచారం అందిందని ప్రచురించింది. సింగిల్ బిడ్ రావడంతో ఇప్పుడు ఈ టెండర్ నోటిఫికేషన్‌ను కూడా కనిపించకుండా చేశారని తెలిసిందని పేర్కొంది. ఆ ఒక్క బిడ్దర్ ఎవరంటూ ఆ కథనంలో ప్రశ్నించింది.
ఈ కథనాన్ని ట్యాగ్ చేస్తూ దేవినేని వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతూ ట్వీట్ చేసింది. ‘మద్యంరవాణాలో అస్మదీయులకు కోట్లు కట్టబెట్టేలా టెండర్? గతంలో పెట్ కు 18రూపాయలు ఇప్పుడు 30 పైనే కోట్, మద్యంసరఫరాకు టెండర్ వేసిన ఒకేఒక్క బిడ్డర్ ఎవరు? రాష్ట్రమంతా ఒక్కరికే ఎలాఇస్తారు? అనామక బ్రాండ్లు,నాసిరకంమద్యంతోపాటు రవాణాలోను జరుగుతున్న దోపిడీపై ప్రజలకు సమాధానం చెప్పండి @జగన్ గారు’ అంటూ ట్వీట్ చేసింది.
గతంలో రోడ్ల కాంట్రాక్టులలో కూడా కేవలం ముగ్గురు బిడ్డింగ్ వేయడం వాటిపై ఆ పత్రిక వరుస కథనాలను ప్రచురించింది. దీంతో ప్రభుత్వం ఆ కాంట్రాక్టును క్యాన్సిల్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పడు కూడా బిడ్డింగ్ లలో ఎవరూ పాల్గొనకుండా చేసి ఒక్క బిడ్ దాఖలైందని ఆరోపణలు వస్తున్న వేళ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
మద్యంరవాణాలో అస్మదీయులకు కోట్లు కట్టబెట్టేలా టెండర్? గతంలో పెట్ కు 18రూపాయలు ఇప్పుడు 30 పైనే కోట్, మద్యంసరఫరాకు టెండర్ వేసిన ఒకేఒక్క బిడ్డర్ ఎవరు? రాష్ట్రమంతా ఒక్కరికే ఎలాఇస్తారు? అనామక బ్రాండ్లు,నాసిరకంమద్యంతోపాటు రవాణాలోను జరుగుతున్న దోపిడీపై ప్రజలకు సమాధానంచెప్పండి@ysjagan pic.twitter.com/2SSBfpGCsh
— Devineni Uma (@DevineniUma) September 29, 2020










