వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి?
ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం గుండా తిరుమలేశ్వరున్ని దర్శిస్తే.. సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి మహత్తర పర్వదినాన తిరుమలలో స్వామివారి దర్శనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ వీఐపీల సేవలోనే మునిగిపోయింది. సామాన్య భక్తులను క్యూ లైన్స్ వదిలేసి, వీఐపీలకు సేవ చేయడం ఏమిటి? అని ఈవో, ఆదనపు ఈవో వైఖరిని నిరసించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి చిన్నపిల్లలతో కంపార్ట్ మెంట్ లోనే ఉండిపోయామని రాత్రి 8 గంటలవుతున్నా స్వామి దర్శనం భాగ్యం కల్పించలేదని భక్తులు మండిపడ్డారు. దీంతో స్వామి వారి ఆలయం మహాద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బైటాయించి ఆందోళనకు దిగారు. టీటీడీ వైఖరిని నిరసిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. క్యూలైన్లలో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఆహారం, తాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయ్యారు. కనీసం కనీకరం లేకుండా గంటల తరబడి క్యూలైన్స్ లో అలా ఏలా వదిలేసి, వీఐపీ సేవల్లో మునిగి తేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.