ఈ నెల 7న మాజీ మంత్రి దేవినేని ఉమ తిరుపతిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి రావడానికి ఎవరు ఇష్టపడతారని గతంలో జగన్ మాట్లాడినట్టు ఉన్నవీడియోను విలేకరులకు ప్రదర్శించారు. ఇది ఫేక్ వీడియో అంటూ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల ఫోర్జరీ కింది కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో కేసు నమోదైంది. వైసీపీ కర్నూలు లీగల్ సెల్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి కర్నూలు సీఐడీ డీఎస్పీ రవికుమార్ కు ఫిర్యాదు చేయడంతో వారు 464, 465, 468, 471, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రజలకు పక్కదారి పట్టించేందుకు…
తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను పక్కదారి పట్టించేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఫేక్ వీడియోను విడుదల చేశారని కర్నూలు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐడీ విభాగాదిపతి పీవీ సునీల్ కుమార్ మీడియాకు వెల్లడించారు. దీనిపై విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.
Must Read ;- జగన్‌కు ఏబీవీ మాస్టర్ స్ట్రోక్.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్