పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడిస్తాం..!
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కుప్పంలో మూడు రోజులు పర్యటించారు. మూడు రోజుల పర్యటనలో చంద్ర బాబు వ్యూహత్మకంగా వ్యవహరించడంతో పెద్దిరెడ్డి నోటికి తాళం పడింది. టిడిపి నేతల విమర్శలకు స్పందించి, ప్రతి విమర్శలు చేయడం మానేయాలని పెద్దిరెడ్డి తమ వర్గంలోని కీలక నేతలకు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తిరుపతి లోక్ సభ, బద్వేలు శాసన సభ ఉప ఎన్నికలు, కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో వైకాపా ఎదురులేని విజయం సాధించడంలో పెద్దిరెడ్డి ఫార్ములా పనిచేసింది. దీంతో కుప్పంలో కూడా డబ్బు, దొంగ ఓట్లతో చంద్రబాబును ఓడించ వచ్చని భావించారు. అందుకే తన ఆఫీసులో పనిచేసే అటెండర్ ను పోటీ పెట్టి చంద్రబాబును ఒడిస్తానాని పెద్దిరెడ్డి సవాలు విసిరారు. కానీ నిజానికి అతని సోదరుడు దివంగత భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని కుప్పంలో పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే కుప్పం వైకాపా ఇంఛార్జి భారత్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి అడ్డు తొలగించు కున్నారు. అయితే హనుమంతుని ముందు కుప్పి గంతులు పనిచేయవన్నట్టు చంద్రబాబు నిరూపించారు. మూడు రోజుల పర్యటనలో ఆఖరు రోజున పెద్దిరెడ్డి అక్రమ మైనింగ్, క్వారీలను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ తనపై అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రతి సవాలు చేశారు. ఇదిలా ఉండగా టిడిపి నేతలు పెద్దిరెడ్డిపై పలు రకాలుగా విమర్శలు చేశారు. పెద్దిరెడ్డికి దమ్ముంటే బాబుపై పోటీచేయాలని కోరారు. ఈ సారి పుంగనూరులో పెద్దిరెడ్డిని ఒడిస్తామన్నామని టీడీపీ నేతలు ప్రతి సవాళ్లు విసురుతూ తగిన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారని సుధాకర్ రెడ్డి వివరించారు.
మంత్రి మైనింగ్ మాఫియా బయటకొస్తే.. బండారమంతా బట్టబయలు!
చంద్రబాబు పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడున్న మంత్రి పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు వ్యూహ రచన చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల క్వారీలు, మైనింగ్ వ్యాపారాలపై అరాలు తీయడం మొదలు పెట్టారు. పెద్దిరెడ్డి అంటే పడని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు టీడీపీ నాయకులకు ఉప్పందించారని తెలిసింది. ఇది గమనించిన పెద్దిరెడ్డి వివాదాలు ముదిరితే మొదటికే మోసమని గ్రహించారు. దీంతో రెండు రోజుల తరువాత టీడీపీ విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం మానేయాలని తన వర్గం వారికి సూచించారని తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం పెద్దిరెడ్డిపై ముప్పేట దాడికి తమ్ముళ్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పెద్దిరెడ్డి అక్రమాలు వెలికి తీసి, ఎక్కడికక్కడ పోరాటం చేయటం, పుంగనూరులో పార్టీని పటిష్ట పరచడంపై దృష్టి పెట్టారు. అలాగే తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి అక్రమాల పైన అరా తీయనున్నారు. పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డి ని ఒడించడంపై ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి బాబుతో పోరాటం కొనసాగిస్తారో లేక తోక ముడుస్తారో వేచి చూడాలని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తన సోషల్ మీడియాలో వివరించుకొచ్చారు.