కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ ను ఆదుకునేందుకు తమిళ హీరో ధనుష్ రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పటికే శివశంకర్ ను ఆదుకునేందుకు నటుడు సోనూసూద్ ముందుకొచ్చారు. శివశంకర్ పెద్ద కుమారుడు, శివశంకర్ భార్య కూడా కరోనా బారిన పడ్డారు. వైద్య ఖర్చులకు వీరు ఇబ్బందులు పడటంతో వీరు స్పందించి ముందుకొచ్చారు. శివశంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని ధనుష్ ఆకాంక్షించారు.
గత ఐదు రోజులుగా శివశంకర్‌కు మాస్టర్ హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వైద్య చికిత్సకు డబ్బు సాయం కావాలంటూ ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో కోరారు. దానికి నిన్న సోనూ సూద్ తో పాటు ఈరోజు ధనుష్ కూడా ముందుకు వచ్చి సాయం అందించారు. చిత్ర పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా శివశంకర్ ను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

మెగాస్టార్ రూ. 3 లక్షల సాయం
కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు.
అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు. చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ “నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు’ అని వెల్లడించారు.











