ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి విక్టరీ కొట్టింది. దీపక్ స్వింగ్ మాయాజాలం ముందు పంజాబ్ విలవిల్లాడింది. చెన్నై మ్యాజిక్ బౌలింగ్‌తో 106 పరుగులకే పరిమితమైంది పంజాబ్. ధోనీ సేన ఆ లక్ష్యాన్ని అలవోకగా అందుకుంది. 15.4 ఓవర్లలోనే విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో గుర్తుండిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. మొయిన్ అలీ 46 పరుగులు, డుప్లెసిస్ 36 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
పంజాబ్ విలవిల..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది పంజాబ్. తొలి ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయింది. అద్భుత స్వింగ్‌తో బోల్తా కొట్టించాడు దీపక్ చాహర్. వెంటనే కెప్లెన్ రాహుల్ సైతం నిరాశ పరిచాడు.5 పరుగులకే రనౌట్‌గా వెనుదిరిగాడు. గేల్ 10 పరుగులు, నికోలస్ పూరన్ డకౌట్‌గా వెనుదిరిగారు. షారుఖ్ ఖాన్ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు. 47 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు.
Must Read ;- రాహుల్ చాహర్ మ్యాజిక్.. కోల్‌కతాపై ముంబయి విజయం











