స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. లాక్ డౌన్ కు ముందే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా.. అన్ లాక్ అయిన తర్వాతగానీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేకపోయింది సినిమా. ఎట్టకేలకు మొన్నామధ్య తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి దండకారణ్యంలో షూటింగ్ ప్రారంభించిన పుష్ప టీమ్.. త్వరలోనే షెడ్యూల్ ముగించుకొని.. తదుపరి షెడ్యూల్ కోసం వారణాసి పయమవబోతోందని వార్తలొస్తున్నాయి.
డిసెంబర్ 18న మొదలు కానున్న తదుపరి షెడ్యూల్ లో వారణాసిలో బన్నీ పై ఓ ప్రత్యేక నృత్యగీతాన్ని ప్లాన్ చేశాడట సుక్కూ. ఇంద్ర కోసం చిరు ‘బంభం బోలే శంఖం మోగెలే’ పాట వారణాసిలోనే చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా వారణాసిలోని పాటకోసం రెడీ అవుతుండడం అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. కాగా.. ఇందులో ఒక ఐటెమ్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నర్తించడం విశేషం. దేవీ శ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ పుష్ప చిత్రానికి చాలా ప్రత్యేకం కాబోతోంది. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపించబోతోంది. మరి పుష్ప లోని వారణాసి సాంగ్ .. సినిమాకి ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.