సుదర్శన చక్రం.. ఎంతో విశిష్టత అంతకు మించి మరెంతో శక్తివంతమైన ఆయుదయం. శ్రీమహావిష్ణువు ఆయుద్ధాల్లో ఒకటి ఇది. లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఈ సుదర్శన చక్రాన్ని తన ఆయుధంగా ప్రయోగించాడనేది పురాణాల ద్వారా మనం తెలుసుకున్న అంశం.మహావిష్ణువు చేతిలోని ఈ చక్రాయుధం అత్యంత శక్తిమంతమైనదని చరిత్ర ద్వారా చెప్పబడుతోంది. శ్రీహరి ఏ ఉద్దేశ్యంతో ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అది నెరవేర్చనిదే వెనక్కి రాకపోవడం ఈ చక్రం యొక్క ప్రత్యేకత.
ముఖ్యంగా దేవతలను, మహర్షులను, సాధారణ మానవులను అనేక ఇబ్బందులకు గురిచేసిన రాక్షసులు ఎందరినో శ్రీహరి ఈ చక్రం ద్వారా సమహరించి ఇబ్బందులు తొలగించారు.అయితే ఎంతటి దుర్మార్గులు అయినప్పటికీ శ్రీహరి మొదటిసారి వారి పై ఈ సుదర్శన చక్రాన్ని ప్రయోగించే వారు కాదు. అన్ని విధాలా వారిలో మార్పు వచ్చేలా చెప్పి చూసి, అప్పటికీ వారిలో మార్పు రాణి పక్షంలో వారిపై ఈ చక్రాన్ని ప్రయోగించేవారు.కాగా, ఈ చక్రం శ్రీ మహావిష్ణువు ఆయుధంగా ఎలా మారిందనే సందేహం చాలామందిలో కలుగుతుంటుంది.దానికి మన పురాణాలు ఇలా చెబుతున్నాయి..
వాస్తవానికి తిరుగులేని ఈ సుదర్శన చక్రాన్ని శ్రీమహావిష్ణువుకు ఇచ్చింది పరమశివుడేనట. పూర్వం ‘శ్రీదాముడు’ అనే అసురుడు అపారమైన తన శక్తిసామర్థ్యాలతో సమస్త లోకాలలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాడు.దీంతో దేవతలు, మానవులు కలిసి తమని రక్షించవలసిందిగా శ్రీహరిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ అసురుడిని అంతమందించేందుకు అవసరమైన సూచన కోసం శ్రీహరి శివుడిని ప్రార్ధించగా..పరమశివుడు ప్రత్యక్షమై, సమస్త దేవతల శక్తి నిక్షిప్తం చేయబడినదంటూ ఈ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ప్రసాదించాడట.
ఒకసారి ప్రయోగించబడిన ఆ చక్రాయుధం ఆ పని పూర్తి అయిన తరువాతనే యథాస్థానానికి చేరుకుంటుందనీ, దానిని ఉపసంహరించడం కుదరదని శివుడు.. శ్రీమహావిష్ణువుకు చెబుతాడు.సమస్త లోకంలో ఎంతటి పరాక్రమ వంతులైనా, తపోబలం కలిగిన వారైనా, వర గర్వితులైనా దాని ధాటికి తల వంచవలసిందేననీ, ప్రాణాలను సమర్పించుకోవాల్సిందేనని పరమశివుడు, శ్రీహరికి ఉద్బోదించారట.ఇక శ్రీదాముడిని సంహరించడానికి ఇదే తగిన ఆయుధమని చెప్పడంతో.. శ్రీమహావిష్ణువు పరమశివుడికి కృతజ్ఞతలు తెలిపి ఆ చక్రాయుధంతో శ్రీదాముడిని సంహరించి, సమస్త లోకాలకు సంతోషాన్ని కలిగించడంలో మరోమారు ప్రధానమైన పాత్రను పోషించాడానేది ఇతిహాస్య సారాంశం.
ఇది శివుని ద్వారా శ్రీమహావిష్ణువు పొందిన.. ఎంతో శక్తివంతమైన సుదర్శన చక్రం విశిష్టత.