ఖాళీ అయిన దుబ్బాక ఎమ్మెల్యే స్థానం కోసం అధికార విపక్షాలు రెండూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. వీటితో పాటు, ఎన్నిక ల్లో విజయాన్ని సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కొంత పుంజుకుంది. దుబ్బాక లో గట్టి పోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.
తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరపాల్సి వచ్చింది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్‌ను రామలింగారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఆశి స్తునట్లు తెలిసింది. అధికార పార్టీలో రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్ ఇస్తే సునాయాసంగా విజయాన్ని సాధించ వచ్చని అధిష్టానం భావిస్తోంది. అధికారికంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సి ఉంది .
తెరాస తరఫున అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దుబ్బాక నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఉప ఎన్నికల్లో బీజేపీ బుద్ది చెప్పాలని ప్రజలకు విన్నవించారు.కాంగ్రెస్ పార్టెకి అభ్యర్థి లేడని, బీజేపీకి కార్యకర్తలు లేరని
దుబ్బాకలో ఎవరు గెలుస్తారని యువకుల నుంచి పండు ముసలిని అడిగినా.. కేసీఆర్ అని ఆయన ప్రచారం చేస్తున్నారు.
ఇలా ఉండగా కాంగ్రెస్ లో టిక్కెట్ కోసం ఎందరో నాయకులు పోటీ పడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కసరత్తు జరుపుతున్నారు. గాంధీభవన్లో నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై వారి సూచనలు స్వీకరించారు. తెరాస అభ్యర్థి ని ఖరారు చేసిన తరువాతే కాంగ్రెస్ అభ్యర్థి ని ఖరారు చేస్తే బాగుంటుందని అధిష్టాన పెద్దలు సూచిస్తున్నారు.
బీజేపీ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేలా తన వ్యూహాలను రచిస్తోంది అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి, 2019లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన రఘునంద న్ రావుకు మళ్లీ టికెట్ దక్కుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ఎన్నో సార్లు పర్యటించారు. ఈ సారి అయినా ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. ఆయన కాకుండా గట్టి పోటీ నిచ్చే మరో నాయకుడు ఎంపిక చేస్తే బాగుంటుందని కొందరు నాయకులు సూచిస్తున్నారు.
తెరాస కాంగ్రెస్‌కు పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు అభ్యర్థి విషయంలో వ్యూహం మార్చవచ్చ ని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు బీజేపీ నేతలు దుబ్బాక టికెట్ ను ఆశిస్తున్నారు. టికెట్ కోసం ఒకరిద్దరు నేతలు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తునట్లు తెలిసింది.
ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇద్దరు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించింది. వీరు నియోజకవర్గ పరిధిలోని మండలాల అధ్యక్షులు, పార్టీ నేతలను కలిసి పార్టీ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. ఈ ఎన్నికలు ఏంతో రసవత్తరంగా మారనున్నాయి.











