(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం గొల్లలవలసలో శ్రీవరి సాగు శిక్షణా కార్యక్రమాన్నిడిప్యూటీ సీఎం కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీవరి సాగు యంత్రాన్నితానే స్వయంగా నడిపి .. వరినాట్లు వేయడంతో అధికారులు .. రైతులు అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరి సాగులో వినూత్న పద్దతులను ప్రోత్సహిస్తోందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చేలా రైతులకు శిక్షణ ఇస్తోందని తెలిపారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Must Read ;- పేరుకే అధికార పార్టీ.. ఆఫీసు అద్దెకు డబ్బుల్లేవ్!











