హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసు కలకలం రేపింది. అందులో సీమ నేతల హస్తం ఉందనే సరికి మరింత ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో సీమ నేతల హవా నడిచింది. పరిటాల రవి.. తర్వాత జగన్మోహన్‌రెడ్డి భూ దందాను ఏలారు. ఆ తర్వాత అడపా దడపా తప్పితే పెద్దగా సీమ నేతల పాత్ర కనపడలేదు. సీమ నేతలు కూడా తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ నేతలతో మాట్లాడుకునే యవ్వారాలు నడిపించుకుంటున్నారని టాక్. అలాంటిది ఇలా కిడ్నాప్ జరగడం.. అందులో మాజీ మంత్రి అఖిలప్రియ పాత్ర ఉందని పోలీసులు అరెస్ట్ చేయడం.. పైగా వారితో అసలు పడని ఏవీ సుబ్బారెడ్డిని ఇందులో ఏ1గా ప్రకటించడం.. ఆ తర్వాత వెంటనే అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.
అందరిలో అనుమానం..
ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే అఖిల ప్రియకు ఏవీ సుబ్బారెడ్డికి పడదు కదా.. పైగా అఖిలప్రియ తనను చంపించాలని చూసిందని కూడా ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.. ఆరోపిస్తున్నారు కూడా.. అలాంటిది ఇలా ఎలా జరిగింది? అనే అనుమానం అందరిలోనూ ఉంది.
అసలు విషయం ఏంటంటే.. ఈ ల్యాండ్ ఎప్పుడో భూమా నాగిరెడ్డి డీల్ చేసిన కేసు. ఆయన హయాంలో దానిని స్వాధీనంలోకి తీసుకున్నారు. అప్పుడు ఆయనతో ఉన్నది ఏవీ సుబ్బారెడ్డి మాత్రమే. ఆ సుబ్బారెడ్డే ప్రస్తుత బాధితులుగా ఉన్నవారితో డీల్ చేసింది.. బెదిరించింది.. గొడవ పడింది కూడా. అందుకే వారు ఏవీ సుబ్బారెడ్డిపై కంప్లయింట్ ఇచ్చారు. అయితే, ఏవీ సుబ్బారెడ్డి మాత్రం తనకు సంబంధం లేదని.. తనను చంపాలనుకున్నవారితో కలిసి తాను కలిసి పని చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సుబ్బారెడ్డికి అన్నీ తెలుసు..
ఇక్కడ ఒక విషయం అయితే ప్రచారంలో ఉంది. అది ఏంటంటే.. భూమా నాగిరెడ్డి గతంలో డీల్ చేసిన వ్యవహారాలన్నిటిలోనూ ఏవీ సుబ్బారెడ్డి చేయి ఉంది. అఖిలప్రియకు తెలిసినవి కొన్ని మాత్రమే.. సుబ్బారెడ్డికి మాత్రం అన్నీ తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు అఖిలప్రియకు సుబ్బారెడ్డికి పడలేదు. కాని అధికారం పోయాక.. లౌక్యం తెలిసొచ్చినట్లుంది.. అఖిలప్రియ తన తండ్రికి సంబంధించిన కేసుల వ్యవహారాలన్నీ సుబ్బారెడ్డి దగ్గర తెలుసుకోవడం కోసం కాస్త కాంప్రమైజ్ అయ్యారని టాక్. అందులో భాగంగానే ఈ కేసును తెలుసుకుని.. తామే డీల్ చేస్తామని చెప్పి.. డీల్ చేయడం మొదలెట్టారని చెబుతున్నారు. అలా ఏవీ సుబ్బారెడ్డికి తెలిసే ఇదంతా జరిగిందని.. కాకపోతే నేరుగా ప్రమేయం ఉందా లేదా అనేది తెలియదని అంటున్నారు.
అలా ఇప్పుడు ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ప్రధాన నిందితుడుగాను, అఖిలప్రియ, భర్త భార్గవ్‌రామ్‌లు ఇతర నిందితులుగాను బుక్కయ్యారు. తండ్రి చనిపోయాక.. భార్గవ రామ్‌ను పెళ్లి చేసుకున్ననాటి నుంచి.. వివాదాలు అఖిలప్రియకు కామన్ అయిపోయాయి. మరోవైపు ఇలా చేయకపోతే ఆళ్లగడ్డ లాంటి చోట నెగ్గుకురాలేరనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి.
Must Read ;- చంచల్‌గూడ జైలులో టీడీపీ మాజీ మంత్రి!