విరుద్ధమైన జీవోను రద్దు చేయడం..
విభజన చట్టం ప్రకారం బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషన్ దాఖలు చేశారు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడం సరికాదని, దీనిని ప్రభుత్వం పున: పరిశీలించాలని ఆయన విన్నవించారు. సెక్షన్ 78(1)కి విరుద్ధమైన జీవో రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. న్యాయపరంగా ముందుకెళ్లెందుకు ఉద్యోగులకు హక్కులున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో వేతనాల్లో కోత పడుతోందని, ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని కేంద్రం చట్టంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమిస్తూనే, మరోవైపు పీఆర్సీ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిటిషన్ లో సీఎస్, ఆర్థిక, రెవిన్యూ, కేంద్ర హోం శాఖలను ప్రతివాదులుగా చేర్చామని కృష్ణయ్య పేర్కొన్నారు.
మిన్నంటుతున్న ఆందోళనలు..
పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యోగుల ఆందోళనల బాట పట్టారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం సమ్మె నోటీసును 14 రోజుల ముందు ఇవ్వాల్సి ఉండగా.. రేపు సమ్మె నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమాయక్తమవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఉపాధ్యాయ సంఘాల సమఖ్య ( ఫ్యాప్టో ) పిలుపు మేరకు ఉపాధ్యాయుల గురవారం అన్ని జిల్లా కలెక్టరేట్స్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలు చోట్ల ఉపాధ్యాయ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విశాఖ, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.