వైసీపీలో కీలక నేతగా… ఆ పార్టీపై… ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైకి దూసుకవచ్చే ఎలాంటి విమర్శలనైనా ఇట్టే తిప్పి కొడుతున్న నేతగా పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నానికి మంచి పేరే ఉంది. అంతేనా వైైసీపీలో చాలా మంది నేతలు నోటి దురుసుతో బూతులు మాట్లాడితే… పేర్నిమాత్రం బూతలకు దూరంగా ఉంటూ…సుతిమెత్తగానే వైరివర్గాల నరాలు తెగేలా వ్యాఖ్యలు చేయడంలో దిట్టగా పేరు గడించారు. ఇక అధికార పార్టీ పెట్టే కేసులకు అదిరేది లేదని నిన్నటిదాకా ఒకింత గట్టిగానే చెప్పిన నాని.. ఆ కేసులు తన గడప తొక్కగానే తనలోని బేలతనాన్ని బయటపెట్టుకున్నారు. తనపైనా, తన భార్య జయసుధపైై కేసులు నమోదు కాగానే… నాని మొత్తం ఫ్యామిలీతో కలిసి పరారయ్యారు. గడచిన మూడు రోజులుగా మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటికి తాళం కప్ప కనిపిస్తోందట. అంతేకాకుండా ఫోన్ లోనూ ఆయన ఏ ఒక్కరికి అందుబాటులోకి రావడం లేదట. వెరసి పరారీలో ఉన్న నేతగా పేర్ని నాని అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు తన గోదామును అద్దెకు ఇచ్చిన నాని… సదరు గోదాములో తగ్గన రేషన్ బియ్యానకి సరిపడ మొత్తం ఎంతో చెబితే అది కట్టేస్తానంటూ నిన్నటిదాకా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించారు. అయితే ఈ విషయాన్ని తర్వాత చూద్దామని…ముందుగా గాయబ్ అయన బియ్యం ఎక్కడికి చేరాయో తేలుద్దామని సివిల్ సప్లైస్ శాఖ చెప్పింది. అంటే… తప్పు జరిగిపోయందని నాని ఒప్పుకున్నట్టే కదా. కనిపించకుండాపోయిన బియ్యానికి పరిహారం కడతామంటే తప్పును అంగీకరించినట్టే కదా. ముందుగా ఆ తప్పు చేసిన వారెవరో తేలుద్దాని ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలోనే గోదాము యజమానిగా ఉన్న జయసుధపై కేసు నమోదు చేసింది. అక్కడితో ఆగకుండా నానితో పాటు నాని వ్యక్తిగత సహాయకులపైనా కేసులు నమోదు అయ్యాయి. ఓ వైపు తాను పరిహారం కడతానన్నా పట్టించకోకుండా… ప్రభుత్వం తనపై కేసులు నమోదు చేసిన తీరుతో నిజంగానే నాని భయపడిపోయినట్టున్నారు. అందుకే కాబోలు నాని తన ఫ్యామిలీతో కలిసి గాయబ్ అయిపోయారు.ఇదిలా ఉంటే… ఇటీవల కాకినాడ పోర్టు ద్వారా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవలే కాకినాడ పోర్టుకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… అక్కడ అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తన్న షిప్ ను సీజ్ చేయాలంటూ ఆయన అధికారులకు ఆదేాశాలు జారీ చేశారు. ఈ ఉదంతంపై స్పందించిన నాని… ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి బంధువులు అయితే అక్రమాలు చేసినా వదిలేస్తారా? అంటూ కూడా నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతేకాకుండా పవన్ తనిఖీలను కూడా ఆయన హేళన చేశారు. ఇలాంటి సందర్భంలో నాని గోదాములో పెద్ద ఎత్తున బియ్యం మాయం కావడం కలకలం రేపింది. ఆ వెంటనే నాని స్పందించడం, కనిపించకుండాపోయిన బియ్యానికి ఖరీదు కడతానని చెప్పడంతో…రేషన్ బియ్యం అక్రమ దందాలో నానికి కూడా పాత్ర ఉందన్న అనుమానాలు రేకెత్తాయి. తనపైనా, తన భార్యపైనా కేసులు నమోదు కావడంతో నాని ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే… ముందస్తు బెయిల్ లభిస్తే తప్పించి నాని కనిపించేలా లేరన్న సెటైర్లు పడుతున్నాయి.