తనని తాను ఐపిఎస్ అధికారిగా ప్రచారం చేసుకుంటూ మెసానికి పాల్పడిన నకిలీ అధికారి శ్రుతి సిన్హా ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరారెడ్డి అనే వ్యక్తికి తన చెల్లితో వివాహం జరిపిస్తానని నమ్మబలికింది. అందుకోసం ఆ వ్యక్తి నుంచి ₹11కోట్లు వసూలు చేసింది. ఇందులో శ్రుతి సిన్హా బంధువు విజయ్ కుమార్ కూడా శ్రుతికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. వీరి మోసాన్ని గ్రహించిన వీరారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.
దీంతో శ్రుతి బంధువు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారెడ్డిని మోసం కేసులో శ్రుతికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 3 కార్లు, ₹6కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రుతిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Must Read ;- బెదిరింపు సందేశాలు.. చివరకు ఎవరో తెలిసి షాక్కయ్యారు!