బాలీవుడ్ ప్రేమజంట కియరా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా గత కొంత కాలంగా లవ్ లో ఉన్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఈ జంట మాత్రం అలాంటిది ఏమీ లేదని చెబుతుంటుంది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతుంటుంది. అయితే.. కొత్త సంవత్సరం వేడుకను జరుపుకునేందుకు మాల్ధీవుస్ కి వెళ్లారు. న్యూయర్ పార్టీకి వెళుతూ విమానాశ్రయంలో కెమెరా కళ్లకు చిక్కిన ఈ జంట తిరిగి ముంబాయికి చేరుకున్నప్పుడు కూడా కెమెరా కళ్లకు చిక్కారు.
ఎల్లో షర్ట్ వేసుకున్న సిద్ధార్ధ్, పింక్ షర్ట్ లో ఉన్న కియరా స్టిల్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాల్థీవుల్లో పార్టీకి సంబంధించిన ఫోటోలను ఈ జంట పోస్ట్ చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో బయటకు రావడం.. వైరల్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ముంబాయి ఎయిర్ పోర్ట్ లో కెమెరా కళ్లకు చిక్కిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ లవ్ జంట విష్ణువర్ధన్ వార్ డ్రామా షేర్షా మూవీలో నటించనున్నారు. కియరా.. జగ్ జగ్ జీయో, భూల్ భూలైయా 2 చిత్రాల్లో నటించనుంది. ఇక సిద్ధార్థ్ మిషన్ మజ్ను, తడం హిందీ రీమేక్ లో నటించనున్నాడు.











