సోషల్ మీడియాలో మోడీకి సంబంధించిన ఓ ఫోటో హోరెత్తిపోయింది. అంబానీ ఇంటిలో కొత్తగా వారసుడు పుట్టాడనగానే.. బుల్లి అంబానీని చూడడానికి ప్రధాని నరేంద్రమోడీ వెళ్లారనేది ఆ ప్రచారం. సాధారణంగా దేశంలోని వీవీఐపీల ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరిగినప్పుడు.. ప్రధాని వంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు కూడా వెళ్లడం వింతేమీ కాదు. కానీ.. ఒకవైపు దేశం రకరకాల సమస్యల్లో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీని రైతులు చుట్టుముట్టి.. ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా.. ప్రధాని ఎంచక్కా.. మనవడు పుట్టిన అంబానీ ఇంటికి వెళ్లారంటే.. ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఒకవైపు డాక్టరు, మరోవైపు ముఖేష్ అంబానీ దంపతులు ఉన్న ఫోటోను వైరల్ చేస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు.
‘‘సర్.. అంబానీల ఆస్పత్రికి వెళ్లి.. ఆయన మనవడిని చూడడానికి మాత్రం మీకు టైముందా? దేశానికి అన్నం పెట్టే, 17 రోజులుగా రోడ్లమీద దీక్షల్లో ఉన్న రైతుల్ని కలవడానికి మాత్రం మీకు టైం లేదా’’ అంటూ ఆ ఫోటో పెట్టి సూటిగా ప్రశ్నించారు. అయితే ఇది నిజమేనా? అనే అనుమానం ఆ పోస్టు చూసిన కొందరికి కలిగింది.
ఫేక్ ఫోటో
కుల్దీప్ బౌద్ధ్ పేరుతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో వాడిన ఫోటో చాలా పాతది. 2014లో మోడీ ప్రధానిగా ఉండగా.. ముంబాయిలో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ను ప్రారంభించడానికి వెళ్లినప్పటి ఫోటో అది. అదే ఫోటోని ఫ్లిప్ కొట్టి (కుడి ఎడమలుగా ఫోటోషాప్ లో మార్చి) దానికి కొత్త ఫోటోగా భ్రమింపజేసేలా ఈ పోస్టు పెట్టారు.
జాగ్రత్తగా చూస్తే అర్థమైపోతుంది
ఫేక్ ఫోటో తో సాగించిన దుష్ప్రచారం.. చాలా వైరల్ అయిపోయింది. ఏదో సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగులాగా.. ‘ఈ పాడు ప్రపంచం నిజం చెబితే నమ్మదు’ అన్నట్టుగానే ఈ వ్యవహారం ఉంది. ఈ ఫోటో అబద్ధపు ఫోటో అయినప్పటికీ విపరీతంగా వైరల్ కావడం విశేషం. అయితే.. తమాషా ఏంటంటే.. కాస్త జాగ్రత్తగా చూస్తే చాలు.. ఇది ఫేక్ అనే సంగతి తెలిసిపోతుంది.
ఈ ఫోటోలో నరేంద్ర మోడీ చాలా కురచగా ఉన్న గడ్డంతో కనిపిస్తున్నారు. కానీ ప్రస్తుతం నరేంద్రమోడీ.. లాక్ డౌన్ తర్వాతి కాలం నుంచి గడ్డం పెంచి.. ఒక రుషిలాగా పొడవైన గడ్డంతో కనిపిస్తున్నారు. అదే విధంగా ఈ ఫోటోలో మోడీ వెనుక విద్యాసాగర్ రావు కూడా ఉన్నారు. ఆయన అప్పట్లో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఇప్పుడు గవర్నర్ పదవినుంచి దిగిపోయి ఖాళీగా ఉన్నారు. అయినా సరే ఫేక్ ఫోటో వైరల్ కావడం విశేషం.
దగా పడ్డ యువత కోసం యువగళం!
ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...