ఆర్ఆర్ఆర్.. సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న మూవీ ఇది. చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా కావడం.. అలాగే నందమూరి ఫ్యామిలీ హీరో ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసారు. హైదరాబాద్ లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ మూవీలో షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుంటే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన కొమరం భీమ్ వీడియో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. యూట్యూబ్ ని షేక్ చేసిందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. అది ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ ఓ సన్ని వేశంలో ముసలి వ్యక్తిగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ సీన్ సినిమాలో ఓ రేంజ్ లో ఉంటుందట. ఇంకా చెప్పాలంటే.. ఆ సీన్ ఆడియన్స్ అంతా షాక్ అయ్యేలా ఉంటుందట.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి ఎండింగ్ కి కంప్లీట్ అవుతుందట. ఈ మేరకు జక్కన్న ఎన్టీఆర్ కు మాట ఇచ్చారని తెలిసింది. అందుచేతనే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాని మార్చి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాని నిర్మిస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఆ పనుల్లో ఉన్నట్టు సమాచారం.
Must Read ;- రియాల్టీ షో చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.