హైదరాబాదు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట మరణాలు నగరంలో సంచలనం సృష్టించాయి. కాచిగూడ పిఎస్ పరిధిలోని నెహ్రూనగర్ లో ఓ జంట మృతదేహాలను గమనించిన స్థానికులు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగేసరికి.. ఆ రెండు మృతదేహాలు ఒక గృహిణిది, ఆమెతో అక్రమ సంబంధం కలిగిఉన్న ప్రియుడిది అని తేలింది. అయితే వీరిలో ఒకరు విషప్రయోగం ద్వారా, మరొకరు ఉరి తీసుకుని మరణించడంతో.. ఎవరు ముందు ఎవరు వెనుక మరణించారు? అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది.
కాచిగూడ పి ఎస్. పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనలో కాచిగూడ పరిధిలోని నెహ్రూ నగర్ లో అక్రమ సంబంధం నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ(23) భర్త, సంవత్సరన్నర బాబు సహా కుటుంబంతో నెహ్రూ నగర్ లో నివాసం ఉంటున్నారు.
అదే కాలనీలోని నివాసం ఉంటున్న నిర్మల్ జిల్లా కు చెందిన హనుమంతరావు(23) అనే ఆటో డ్రైవర్ తో కొంతకాలంగా భాగ్యశ్రీ అక్రమ సంబంధం పెట్టుకుంది. నిన్న ఉదయం భాగ్యశ్రీ మరియు హనుమంతరావు స్వల్ప ఘర్షణ పడి భాగ్యశ్రీ మొదటగా పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని, దాంతో భయంతో హనుమంతరావు ఉరి వేసుకొని ఆత్మ హత్య కు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు ఇద్దరివీ ఆత్మహత్యలుగా కేసులు నమోదు చేసుకొని కాచిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…