పూరి మార్కు, విజయ్ దేవరకొండ మాస్ పల్స్ వెరిసి ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్. ఈ రోజు ఉదయం ఈ గ్లింప్స్ విడుదల చేయగానే సోషల్ మీడియాలో దూసుకుపోయింది. తెలుగు, హిందీతో పాటు ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఈ గ్లింప్స్ ద్వారా పూరి చెప్పేశారు. ముంబయిలోని ధారావి అనే మురికి వాడ కుర్రాడు అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటాడని అర్థమవుతోంది. అతనే లైగర్. అతని తల్లి పాత్రను రమ్య కృష్ణ పోషిస్తోంది.
ఆమెను ఆడ పులి అనుకోవాలేమో. ఎందుకంటే ఆడపులికి మగ సింహానికి పుట్టిన బిడ్డను లైగర్ అంటారు. ఒక స్లమ్ డాగ్ కిక్ ఎలా ఉండబోతోందో మనం సినిమాలో చూడబోతున్నామన్న మాట. వచ్చే ఆగస్టు 25న ఈ సినిమా విడుదలకాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి మార్క్, విజయ్ హై వోల్టేజ్ యాక్షన్‌తో ‘లైగర్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్ మాత్రం అదరగొట్టేస్తోంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంట నటిస్తున్నారు.
సాలా క్రాస్‌బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఇంతకుముందు పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. మరి ఈ క్రాస్ బ్రీడ్ వెనక ఇంకెలాంటి కథ ఉందో చూడాలి. ఈ సినిమా అప్‌డేట్స్ వరసగా ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు. పక్కా పూరి మార్క్‌తో సినిమా ఉంటుందని ఈ గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతుంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో విజయ్ దేవరకొండ నటన ఉండబోతుందని అనుకోవచ్చు. ఇందులో అతనిది ఛాయ్ వాలా పాత్ర అట. అతను ఎంఎంఏ ఛాంపియన్‌గా ఎలా మారాడనేది అసలు కథ. సినిమా మీద అంచనాలు పెంచేలా ఈ గ్లింప్స్ ఉందని చెప్పవచ్చు. మున్ముందు ఇంకా ఎలాంటి సర్ ప్రైజ్ లు పూరి ఇవ్వబోతున్నారో చూడాలి.











