ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ మూవీకి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కావడంతో ముఖ్యంగా నార్త్ లో ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. అక్కడ అంతగా ప్రచారం చేయకపోయినా.. రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్రం మరొక రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. అది ఏంటంటే.. హిందీలో కేజీఎఫ్ చిత్రం లైఫ్ టైంలో సాధించిన వసూళ్ళను పుష్ప 13 రోజుల్లో అధిగమించడం విశేషం. ఈ చిత్రం నార్త్ లో 13 రోజుల్లోనే 45.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బాలీవుడ్ లో దూసుకు పోతుంది. ఇంకా ప్రచారం చేసుంటే.. డివైడ్ టాక్ కాకుండా హిట్ టాక్ వచ్చుంటే.. ఇంకెంత కలెక్ట్ చేసేదో ఊహించుకోవచ్చు.
ఈ చిత్రంలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం విశేషం. ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ లు కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పుష్ప ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఉత్సాహంతో పుష్ప పార్ట్ 2ను మార్చి నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2022 దసరాకి కానీ.. క్రిస్మస్ కి కానీ.. పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- పుష్ప 2 విషయంలో అలా జరగదంటున్న నిర్మాతలు.











