మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగాస్టార్ తనయుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం చిరుత అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్ .. ఇలా అన్నింటిలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆతర్వాత మగధీర, ఆరెంజ్, రచ్చ, నాయక్, ఎవడు, గోవిందు అందరివాడేలా.. ఇలా విభిన్న కథా చిత్రాలతో మెప్పించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించి ఏ పాత్రలో అయినా నటించగలనని మెప్పించాడు రామ్ చరణ్.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. జవనరి 7న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకి 45 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని.. ఆతర్వాత శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీకి, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న మూవీకి రామ్ చరణ్ రెమ్యూనరేషన్ గా100 కోట్లు తీసుకుంటున్నాడని ఈమధ్య వార్తలు వచ్చాయి. దీంతో ఇండియాలోనే ప్రభాస్ తర్వాత అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో చరణ్ అంటూ ప్రచారం మొదలైంది.
అయితే.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న చరణ్‌కు ఈ రెమ్యునరేషన్ గురుంచిన ప్రశ్న ఎదురయ్యింది. దీనికి రామ్ చరణ్ ఏమన్నారంటే.. ఆ వార్తలు వాస్తవం కాదు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు. అసలు ఈ 100 కోట్లు వార్త ఎక్కడ నుంచి వచ్చింది..? నాకు ఎవరు ఇస్తున్నారు.? అని చరణ్ చమత్కరించాడు. ఈవిధంగా అది ఓ గాసిప్ మాత్రమే అని ఓ క్లారిటీ వచ్చింది.
Must Read ;- ట్రిపుల్ ఆర్ లో అది ఒక్కటే నెగిటివ్ అంశం?











