108- సినిమా అనే వెండితెర వెలుగులకూ ఈ సంఖ్యకూ అనుబంధం ఉన్న రోజుది. మన దేశంలో తొలి సినిమాను జనం వీక్షించిన రోజు అని చెప్పాల్సి ఉంటుంది. ఆ తొలిసినిమా మరేదో కాదు ‘రాజా హరిశ్చంద్ర’. దాదాసాహెబ్ ఫాల్కే లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు మూలపురుషుడైన ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే రూపొందించిన భారతీయ తొలిసినిమా ఇది. అందుకే ఆయన భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. ఈ సినిమాను ప్రజల కోసం బొంబాయి కోరోనేషన్ సినిమా హాల్లో 1913 మే 3న ప్రదర్శించారు. మరి ఈ సినిమా వెనక ఇంకా ఎంత కథ ఉందో కూడా తెలుసుకుందాం.
ఫాల్కే ఎక్కడివాడు?
ఫాల్కే జన్మస్థలం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్. 1870 ఏప్రిల్ 30న ఆయన జన్మించారు. తండ్రి ఉద్యోగ నిమిత్తం ఈ కుటుంబం ముంబయిలో స్థిరపడింది. ఫాల్కేకి కళలంటే అభిరుచి. ముఖ్యంగా రాజారవి వర్మ చిత్రలేఖనం అంటే ఎంతో అభిమానం. జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి చిత్రలేఖనం కూడా నేర్చుకున్నారు. ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే మహారాష్ట్ర సమీప త్రయంబకేశ్వర్ లో 1870 ఏప్రిల్ 30 న జన్మించాడు. ఫాల్కె తండ్రితో ఉద్యోగ నిమిత్తం బొంబాయి చేరాడు. కళాత్మక అభిరుచి ఉండటంతో 1885 లో జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు.
చిత్రలేఖనం చేర్చుకున్నాడు. బరోడా లోని ప్రఖ్యాత “కళాభవన్”లో ఫోటోగ్రఫీ, మౌల్డింగ్, ఆర్కిటెక్చర్ వంటి అనేక కళలనే కాక మాజిక్ విద్యను కూడా నేర్చుకున్నాడు. ఫోటోగ్రఫర్ గా, సీన్ పెయింటర్ గా కెరీర్ సాగుతున్న సమయంలో 1910 డిసెంబరు 25న లైఫ్ ఆఫ్ క్రీస్ట్ సినిమాను చూడటంతో కొత్త ఆలోచనకు నాంది పలికినట్లయింది.
ఏదో చెయ్యాలన్న తపన లండన్ వెళ్లేలా చేసింది. వివిధ దేశాలు తిరిగి తాను చెయ్యాల్సిన ప్రయోగలకు ఎలాంటి పరికరాలు అవసరమో అవి కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఓ కెమెరా కొని తెచ్చారు. దాంతో బఠానీ చెట్టుకు సంబంధించి ఓ షార్ట్ ఫిలిం తీసి తన ఫ్రెండ్ యశ్వంత్ నాదకర్ణికి చూపారు.
తొలి సినిమాకు స్నేహితుడి చేయూత
తనకు ఓ సినిమా చేయాలన్న ఆలోచన ఉన్నట్లు స్నేహితుడికి చెప్పడంతో అతను కొంత డబ్బు సహాయంగా ఇచ్చాడు. తన ఇన్సూరెన్స్ పాలసీ మీద రూ. 10 వేల అప్పు సంపాదించారు. సినిమాను వ్యాపారంగా కాకుండా కళగానే ఆయన చూశారు. ఎలాంటి కథను ఎంచుకోవాలా అని ఆలోచించి సత్యసంథత మూర్తీభవించిన హరిశ్చంద్రుడి కథ అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్నీ, కుటుంబాన్నీ త్యాగం చేసే ఈ కథ అయితేనే బాగుటుందనుకుని ప్రారంభించారు. స్వీయదర్శకత్వంలోనే నిర్మాణం ప్రారంభించారు.
పాత్రధారులంతా పురుషులే
ఇందులో నటించిన వారంతా పురుషులే. స్త్రీపాత్రలను కూడా వారే పోషించారు. దానికి కారణం నటించడానికి స్త్రీలు ఎవరూ ముందుకు రాకపోవడమే. నాటకాలన్నా, సినిమాలన్నా చిన్నచూపు ఉండటమే అందుకు కారణం. ఎవరూ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పవద్దని, హరిశ్చంద్ర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని చెప్పమనేవారు ఫాల్కే. ఈ సినిమాలో హరిశ్చంద్రుడి కుమారుడు లోహితాశ్యుడిగా ఫాల్కే కుమారుడు బాలచంద్ర నటించారు. తొలి భారతీయ బాలనటుడిగా అతని పేరునే చెప్పాల్సి ఉంటుంది.
రాజా రవివర్మ చిత్ర పటంతోనే సినిమా ప్రారంభమవుతుంది. మరాఠీ రంగస్థల నటుడు దత్తాత్రేయ దామోదర డబ్కే ఇందులో హరిశ్చంద్రుడి పాత్రను పోషించారు. అన్నా సాలుంకే చంద్రమతిగా, ఫాల్కే కుమారుడు బాలచంద్ర లోహితాస్యుడుగా, జి.వి.సానే విశ్వామిత్రుడిగా నటించారు. చంద్రమతి వేషధారణకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫాల్కే దేవదాసీల కోసం ప్రయత్నించారు. అది విఫలమవడం వల్ల అన్నా సాలుంకే అనే రంగస్థల నటుడి చేత ఛంద్రమతి వేషం వేషం వేయించాల్సి వచ్చింది. నాలుగు రీళ్లతోనే సినిమాని ముగించారు. సినిమా నిడివి 40 నిమిషాలు. ఒకేఒక్క ప్రింటు వేశారు.
మరాఠీ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో సబ్‌టైటిల్స్ వేశారు. దీంతో ఇది తొలి మరాఠీ మూకీ చిత్రంగా గుర్తింపు లభించింది. 4ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శన 1913 ఏప్రిల్ 21న బొంబాయి ఒలింపియా థియేటర్లో నిర్వహించారు. తర్వాత బొంబాయి కోరోనేషన్ సినిమా హాల్లో 1913 మే 3న ప్రజల కోసం ప్రదర్శించారు. అప్పట్లో మూకీలకు మాటలు ఉండవు. కాబట్టి =నాటకీయ పద్ధతిలో చిత్రీకరించేవారు. ముఖ్యంగా మైమ్ చేస్తున్నట్లుగా వాళ్ల మాటలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా నటించడానికి ప్రయత్నించారు. సినిమా ప్రదర్శన జరుగుతుంటే మైకులో ఒకరు తెరపై జరుగుతున్న సన్నివేశానికి వ్యాఖ్యానం చెప్పేవారు. కథనం అర్థమయ్యేలా అతను చెప్పడంతో ఏంజరుగుతుందో ప్రేక్షకులకు అర్థమయ్యేది.
తొలి చిత్రం మీద వివాదం
అసలు తొలి చిత్రం ఏది అనే విషయంలో వివాదం ఉంది. మొదటిసారిగా భారతీయ మూకీని దాదా తోర్ని 1912లోనే రూపొందించారు. దాని పేరు ‘పుండలీక్’. ఏదో తీయాలన్నట్లు తీసినట్టు ఉండటం, పైగా అందులో ఏ ప్రత్యేకతా లేకపోవడంతో దాన్ని సినిమాగా గుర్తించలేదు. అందువల్ల ‘రాజా హరిశ్చంద్ర’నే తొలిచిత్రంగా గురించారు. విదేశీ చిత్రాలకు ధీటుగా అప్పట్లో రూపొందిన సినిమాగానూ దీన్ని చెప్పాల్సి ఉంటుంది.