అది 2019 ఎన్నికల సమయం.. వెయ్యి మోసాలతో ప్రజల గొంతుకు ఉచ్చు బిగుస్తున్న రోజులవి. కట్ చేస్తే.. గద్దెనెక్కి జగన్ రెడ్డి.. యువత ఉపాధి పై దెబ్బేసి.. ఉసురు తీశారు.
జగన్ రెడ్డిని నమ్మి ఓటేసిన పాపానికి యువతరం నేడు నిర్విర్యం దశగా అడుగులు వేస్తోంది. 2019 ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తెచ్చి.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్నీ పోస్టులను భర్తీ చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి.. నేడు ఆ హామీని మరిచారు. జాబ్ క్యాలెండర్ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 25 లక్షల మంది యువతను మోసం చేశాడన్నది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
జాబ్ క్యాలెండర్ వస్తే ఉద్యోగాలు వస్తాయని.. ఎన్నో ఆశలతో యువత ఓటు వేసి జగన్ రెడ్డి గెలిపించుకున్న నేరానికి నేడు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గ్రూపులు, మెగా డీఎస్సీ వంటివి నోటిఫికేషన్లు ఇవ్వకుండా చేతులెత్తేశారు.
హైదరాబాద్ ని ఐటీ హబ్ గా మార్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. 2014 ఏపీ తొలి ముఖ్యమంత్రి హోదాలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంగా 54 భారీ, మధ్యతర పరిశ్రమలను తీసుకొచ్చారు చంద్రబాబు. తద్వారా యువతకు 25 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించారు. హీరో మోటోకార్ప్, ఫాక్స్ కాన్, ఇసుజు మోటార్స్ వంటి పేరుగాంచిన ప్రపంచస్ధాయి కంపెనీలను తీసుకొచ్చి సీమలో ఉపాధిని పరుగులు పెట్టించారు.
ఒక్క చిత్తూరు జిల్లాలోనే రూ. 4600 కోట్ల పెట్టుబడులతో ప్రత్యక్ష్యంగా 800 ఉద్యోగ కల్పన చేయగా.. పరోక్షంగా మరో 1000 పైగా ఉపాధి లబించింది. అలానే నెల్లూరు జిల్లాలో రూ.1,200 కోట్ల పెట్టుబడితో భారత్ ఫోర్జ్ యూనిట్ ని స్ధాపించి 3 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చారు. అలానే అనంతపురం జిల్లాలో కూడా రూ. 25 వేల కోట్లతో 22 వేల మంది యువతకు ఉద్యోగాలను కల్పించారు చంద్రబాబు. అది చంద్రబాబు నాయుడు దార్శినికత అని.., వీటికి మించిన ప్రత్యేక రుజువులు ఏం కావాలి..? అని యువత నమ్ముతోంది.
ఇలా ప్రభుత్వ.., ప్రైవేటు రంగ సంస్ధల్లో ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు చూపిన చొరవ ప్రశంసనీయం. జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. ప్రభుత్వ శాఖలో ఖాళీ అవుతున్న పోస్టులను సైతం భర్తీ చేయలేని దుస్ధితిలో ఉన్నారన్నది వాస్తవం. అందుకే ఏపీలో యువత నిన్ను నమ్మం జగన్ రెడ్డి అని సోషల్ మీడియాలో స్లోగన్ చేస్తూ..పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారు.











