కాంగ్రెస్ సూపర్ సిక్స్ పధకాల అమలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకుగానూ ఆర్టీసీతో చర్చలు షురు చేశారు.
ఎన్నికల హామీలో భాగంగా.. రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ.. హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. అందుకుగానూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రేపు నుంచి అనగా డిసెంబర్ 9 నుంచి రాష్ట్ర మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్ లో ప్రయాణించే వసతిని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరుకు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమావేశం అయ్యారు. ఈ ఉచిత బస్ ప్రయాణం అమలుకు ఎదురయ్యే సమస్యలు.., నియమ, నిబంధనలు.. ఆర్టీసీ సైడ్ నుంచి తలెత్తే ఇబ్బందులు వంటి వాటిపై చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణ ఆర్టీసీ నుంచి పలువురు ఉన్నతాధికారులు కర్నాటక వెళ్లారు. ఇప్పటికే కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పధకం అమలులో ఉంది. అయితే పధకం అమలలో ఎదురయ్యే ఛాలెంజ్స్ ను నిశితంగా పరిశీలించి.. నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు అందజేయనున్నారు. అయితే ఆర్టీసీలో ఆర్డినరీ, లెగ్జరీ, సూపర్ లెగ్జరీ, మెట్రో, గరుడ వంటి బస్సులు వంటి ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ ఏ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ వసతి కల్పిస్తారు అన్నదానిపై క్లారిటీ రానున్నది.
ప్రధానంగా కర్నాటక రాష్ట్రంలో దాదాపు 22 వేల బస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ తెలంగాణ ఆర్టీసీ వద్ద అన్ని బస్సులు లేవు. దాదాపు 8 వేల 500 బస్సులు మాత్రమే అందుబాటు ఉన్నాయి. అయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనగానే మహిళలందరూ ఆర్టీసీ ప్రయాణానికి మొగ్గు చూపితే.. ఇక్కడున్న బస్సులు సరిపోవు. అలానే ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో 12 నుంచి 13 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని అంచన. ఉచితం అంటే.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆర్టీసీకి రోజు 4 కోట్ల మేరకు నష్టం వాటిల్లే పరిస్ధితి కూడా ఉంది. అయితే వీటన్నీంటిపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించి.. రేపటి నుంచి పధకం అమలకు తుది కరసత్తును ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది.