రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో, 18 ఏళ్ళు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం విధితమే. అయితే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ ఉచితంగా అందించే యోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వగా.. ఇప్పుడు 18 ఏళ్లు దాటిన వారికి కూడా ఫ్రీగా టీకాలు అందించనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తే ఉచితంగా ఇస్తామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల గతంలోనే ప్రకటించారు. ఆ దిశగానే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని మొదట ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అసోం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు అడుగులు వేస్తోంది.
Must Read ;- కేంద్రానికో ధర.. రాష్ట్రాలకో ధరనా?: వ్యాక్సిన్ ధరలపై కేటీఆర్ ట్వీట్