కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ రోజు నుంచి మే 1 వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ నుంచి మీడియా, పెట్రోలు బంకులు, మందుల షాపులు , ఆసుపత్రులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఈ-కామర్స్ వంటి అత్యవసర సర్వీసులను మినహాయించారు. కర్ఫ్యూతో పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. కరోనా కట్టడి చర్యలపై తెలంగాణ ప్రభుత్వాన్ని నిన్న హైకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి నైట్ కర్ఫ్యూ విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.