ఆంధ్రప్రదేశ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న వైఎస్ఆర్ సీపీ పార్టీకి, తెలంగాణలో ప్రతికూల భావనలు వెంటాడుతున్నాయి. తాజాగా వైసీపీ తెలంగాణ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో తెలంగాణలో వైసీపీ షాక్ తగిలినట్లయింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు పార్టీ ఆదేశాల మేరకు నడుచుకున్నానన్నారు. ఏపీలో ప్రజలు వైసీపీని బలంగా నమ్మారని, అందుకే అత్యధిక స్థానాల్లో విజయాలు కట్టబెట్టారని, కానీ తెలంగాణలో వైసీపీ పోరాటాలు చేయలేదన్న భావన ఇక్కడి ప్రజల్లో ఉందన్నారు. తాను జాతీయ పార్టీలో చేరుతానని వెల్లడించారు. అయితే వైసీపీలో మిగిలిన ముఖ్యనాయకులు కొందరు కూడా, శ్రీకాంత్ రెడ్డి బాటలో నడిచి, వేరే పార్టీలో చేరేందుకు కార్యాచరణ తయారుచేసుకుంటున్నట్లు సమాచారం. మిగిలిన నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేస్తే తెలంగాణలో వైసీపీ నిలబడటం కష్టమేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ నాయకులు.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











