ఆంధ్రప్రదేశ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న వైఎస్ఆర్ సీపీ పార్టీకి, తెలంగాణలో ప్రతికూల భావనలు వెంటాడుతున్నాయి. తాజాగా వైసీపీ తెలంగాణ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో తెలంగాణలో వైసీపీ షాక్ తగిలినట్లయింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు పార్టీ ఆదేశాల మేరకు నడుచుకున్నానన్నారు. ఏపీలో ప్రజలు వైసీపీని బలంగా నమ్మారని, అందుకే అత్యధిక స్థానాల్లో విజయాలు కట్టబెట్టారని, కానీ తెలంగాణలో వైసీపీ పోరాటాలు చేయలేదన్న భావన ఇక్కడి ప్రజల్లో ఉందన్నారు. తాను జాతీయ పార్టీలో చేరుతానని వెల్లడించారు. అయితే వైసీపీలో మిగిలిన ముఖ్యనాయకులు కొందరు కూడా శ్రీకాంత్ రెడ్డి బాటలో నడిచి, వేరే పార్టీలో చేరేందుకు కార్యచరణ రూపొందించుకుంటున్నట్లు సమాచారం. మిగిలిన నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేస్తే తెలంగాణలో వైసీపీ నిలబడటం కష్టమేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ నాయకులు.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











