తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన ఎంఈఏటీఎఫ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సమాజహితం కోసం సేవలందించిన మహిళలను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ , తెలంగాణ గవర్నర్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ జాబితాను ఆ సంస్థ ప్రకటించింది.
Also Read ;- చేతుల్లేకున్నా చదువు కోసం పోరాటం.. సలాం చేయాల్సిందే