సుదీర్ఘమైన అమెరికా ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. విజయానికి అవసరమైనది 270 ఎలక్టోరల్ ఓట్లు కాగా, 264 వరకు చాలా వేగంగా చేరుకున్నడెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్ మూడు రోజుల నిరీక్షణ తర్వాత మ్యాజిక్ ఫిగర్ ను అందుకున్నారు. పెన్సిల్వేనియా, నెవాడాల లెక్కింపుతోనే బైడెన్ 290 ఓట్లు సాధించేశారు. జార్జియా, అలాస్కా, నార్త్ కరోలినా లెక్కింపు అనేది నామమాత్రం అయిపోయింది.
భారతీయ గర్వ ప్రతీక కమలాహారిస్
భారతీయ మూలాలు ఉన్న తమిళురాలు అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం మన దేశానికి గర్వకారణం. అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టనున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సష్టిస్తున్నారు.
సీనియర్ బుష్ తర్వాత ట్రంపే
సీనియర్ బుష్ గా పేరున్న జార్జి హెచ్ డబ్ల్యు బుష్ అధ్యక్షుడిగా ఉంటూ 1992లో ఓడిపోయారు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడిగా వరుసగా రెండు సార్లు పనిచేసే అవకాశం ఉంటుంది. చాలా మంది అధ్యక్షులు రెండోసారి కూడా గెలుస్తుంటారు. ఇప్పుడు బైడెన్ 46వ అధ్యక్షుడు. ఇప్పటిదాకా పనిచేసిన వారిలో రెండోసారి ఓడిపోయినది కేవలం 11 మంది మాత్రమే. 1992లో సీనియర్ బుష్ క్లింటన్ చేతిలో ఓడిపోయారు. రెండుసార్లు పనిచేసిన క్లింటన్ నుంచి అధికారం జూనియర్ బుష్ (జార్జి డబ్ల్యు బుష్) చేతికి వచ్చింది. ఆయన కూడా రెండు పర్యాయాలు సేవలందించారు. తర్వాత ఒబామా వంతు వచ్చింది. ఒబామా కూడా రెండుసార్లు పదవిలో ఉన్నారు. ఒబామా నుంచి అధికారం దక్కించుకున్న ట్రంప్.. పదవిలో ఉంటూ రెండోసారి ఎన్నికల్లో ఓడిపోయారు.
లియో ముందే జోస్యం చెప్పింది..
బైడెన్ కే విజయావకాశాలు ఉన్నాయని దిలియోన్యూస్ డాట్ కామ్ ముందే జోస్యం చెప్పింది. ఆస్ట్రాలజీని అధ్యయనం చేస్తున్న పామర్తి హేమసుందర్.. దిలియోన్యూస్ వెబ్ సైట్ లో సాధికారమైన వ్యాసం రాశారు. ఇంటర్నెట్ ద్వారా లభ్యమయ్యే పుట్టిన తేదీలను బట్టి.. గ్రహగమనాలను, పరిణామాలను అంచనా వేశారు. జో బైడెన్ నే విజయం వరిస్తుందని పేర్కొన్నారు. నిజానికి దేశంలో ఈ ఫలితాలపై జోస్యం చెప్పిన అనేక మంది జ్యోతిష్యవేత్తలు ట్రంప్ కు విజయావకాశాలు ఉన్నాయనే రాశారు. నిజానికి అమెరికాలో పదవిలో ఉన్న అధ్యక్షుడు రెండోసారి నెగ్గడం చాలా మామూలుగా జరిగే పద్ధతి. అలాంటి ఒక అంచనాను.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా తన ట్విటర్ లో పేర్కొన్నారు కూడా.
అయితే పామర్తి హేమసుందర్ మాత్రం విజయం బైడెన్ కే దక్కుతుందని, ట్రంప్ జాతకం ప్రకారం ఒక పట్టాన అధికారాన్ని అప్పగించే రకం కూడా కాదని అంచనా వేశారు. పామర్తి హేమసుందర్ భృగునాడీ జ్యోతిష్యం ప్రకారం పరాశర పద్ధతిలో ఇరువురు అభ్యర్థుల జన్మనక్షత్రాలను బట్టి జాతకాన్ని, ఫలితాన్ని అంచనా వేశారు.
ఆ రకంగా దిలియోన్యూస్ చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైంది. బైడెన్ గెలిచారు.. అధికారం అప్పగించడానికి ససేమిరా అంటూ ట్రంప్ మొండిపట్టు పట్టడం కూడా అలాగే జరుగుతోంది.
ఇదీ చదవండి :
బైడెన్ కే విజయావకాశాలు
అమెరికాపై ఆ జోస్యం ఒకలా.. లియో జోస్యం మరోలా..










