గోదావరిని తలచుకోనిదే దర్శకుడు వంశీకి నిద్రపట్టదు. ఆయన సినిమాలన్నీ గోదావరి ఒడ్డునే జీవం పోసుకోవడం ఎప్పటినుంచో చూస్తున్నాం. గోదావరి మీద కథలు, సీరియల్స్ రాయడం ఆయనకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం ఆయన సినిమాలేవీ తీయకపోయినా.. గోదావరి అందాల్ని మాత్రం ఆయన తన మనసులో అలాగే నిక్షిప్తం చేసుకున్నారు. వాటిని ఇప్పుడు వెబ్ సిరీస్ గా తీసుకురానున్నారట. కాకపోతే డాక్యుమెంటరీ రూపంలో దృశ్యకావ్యంగా ఆవిష్కరించడానికి వంశీ రెడీ అవుతున్నారని తెలుస్తోంది.
గోదావరి పరివాహక ప్రాంతాలు, అక్కడి ప్రజల అభిరుచులు, చరిత్ర, అక్కడి రుచులు, అక్కడి నుంచి వచ్చిన ప్రముఖులు, సెలబ్రిటీలు.. ఇలా గోదావరికి రిలేటెడ్ అయిన సమస్త సమాచారాన్ని ఆయన డాక్యుమెంటరీ రూపంలో వెబ్ సిరీస్ గా తెర కెక్కించబోతున్నారట. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి.. డాక్యుమెంటరీస్ ను ఎక్కువగా స్ట్రీమ్ చేసే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ కోసం వంశీ ఈ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ ను చేయబోతున్నారని సమాచారం. మరి వంశీ గోదావరి ప్రేమ.. వెబ్ సిరీస్ లో ఏ మేరకు రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి.