మద్యపాన నిషేదం దేవుడెరుగు.. ఆరోగ్యం దొబ్బుతోందిక్కడ!
జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపానం నిషేదం అని ఏపీని మద్యాంధ్రగా మార్చేశారు. ధరలు అమాంతం పెంచడమేకాకుండా బూమ్, బూష్, తుష్ అని కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి.. మందుబాబుల జీవితాలు ఆటలాడుతున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా వివిధ రకాల మద్యం బ్రాండ్లు ఏపీలో దర్శనమిస్తున్నాయి. దీంతో మందుబాబులు రెగ్యూలర్ గా తాగే బ్రాండ్స్ ఇక్కడ లభించకపోవడంతో పక్క రాష్ట్రంలో నుంచి అక్రమ మార్గంలో తీసుకొచ్చిన మద్యం కోనుగోలపై మక్కువ చూపుతున్నారు. ఏపీ లిక్కర్ పాలసీ ప్రభుత్వాదాయానికి భారీ గండికొడితే.. పక్క రాష్ట్రాల పాలిట వరంగా మారింది. కొత్త బ్రాండ్లు ప్రజల జేబులన్నే కాదు.. కడుపు కూడా కొడుతోంది! ఒక్క ఛాన్స్ పేరుతో చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ చెంపలు వేసుకోవడమే తప్ప, చేసేదేముంది అని మద్యం ప్రియులు బాధలను దిగమింగుకుంటున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో ఓ మందుబాబు ఏకంగా జిల్లా కలెక్టర్ కు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి కాల్ చేశారు గోడు విన్నవించాడు. సార్ .. మా ఊరికి గతంలో ఉన్న మందు బ్రాండ్స్ అమ్మెలే మీరే దయచూపాలి.. అలానే మరో రెండు కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేయాలని వేడుకోవడం జిల్లా యంత్రాంగ ఒక్కసారిగా అవాక్కైయ్యేలా చేసింది.
మా బాధను అర్థం చేసుకొండి సార్..
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభిస్తారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నిన్న సోమవారం జిల్లా కలెక్టర్ వివేక యాదవ్ డయల్ యవర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాలోని చేబ్రోలుకు చెందిన ఓ మందుబాబు కాల్ చేసి.. కలెక్టర్ గారు మా ఊరులో మద్యం షాపులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. మద్యం షాపు ఒకటే ఉండటం కారణంగా క్యూలైన్ లో నిలబడలేకపోతున్నామని, మా బాధను అర్థం చేసుకుని మద్యం షాపులను పెంచాలని కోరారు. అంతేకాక గతంలోగా మంచి బ్రాడ్స్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టర్ వివేక్ కు ఇదోక వింత అనుభవంలా భావించి.. మీ సమస్యను పరిష్కరిస్తామని ఫోన్ కట్ చేశారు. ఇలా జిల్లా కలెక్టర్లకు ఇళ్ల స్థలాలు, ఇల్లు, రేషన్ కార్డు, పింఛన్, పట్టదారు పాసు పుస్తకం వంటి సమస్యలే కాదు.. మద్యం సమస్యలు కూడా చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Must Read:-అప్పు లేనిదే పూట గడవుదు..! మరో రూ. 27 వేల కోట్ల అప్పుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం!











