శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, ఈవో లవన్న దంపతులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు. స్వామివారికి అమ్మవారికి వివిధ వహన సేవలు, శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవం రేపటి నుంచి నిర్వహించనున్నారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది నేటి నుండి మార్చి 4 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నల్లమల నుండి పాదయాత్రగా వచ్చే భక్తులకు చలువ పద్దిళ్ళు మంచినీరు,ఆహారం,వైద్యం,పుణ్య స్నానాలకు షేవర్స్ మొదలగు ఏర్పాటు చేశారు అలానే శ్రీశైలం వచ్చిన భక్తులకు క్షేత్రపరిధిలో వివిధ ప్రాంతాల్లో చలువ పందిళ్లు,డర్మేంటరీస్ ఏర్పాటు చేశారు రేపటి నుండి భక్తులందరికి మార్చి 4 బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు ప్రత్యేకంగా శివదీక్ష స్వీకరించిన స్వాములు ప్రత్యేక క్యూలైన్స్ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు వాహనదారులకు ప్రత్యేకంగా హైస్కూలు పక్కన టూరిస్టు బస్టాండ్ వద్ద శివాజీ స్ఫూర్తి కేంద్రం ముందు భాగంలో వాహనాల పార్కింగ్ కు కాలి ప్రదేశాలు చదును చేశారు క్షేత్రపరిధిలో వివిధ ప్రాంతాల్లో త్రాగునీటి కోసం శివగంగా జలప్రసాదం సిద్ధం చేశారు ఇప్పటికే క్షేత్రం మొత్తం బ్రహ్మోత్సవాల సందడి వాతావరణం నెలకొంది ఆలయం ముందుభాగంలో ప్రధాన విధులలో విద్యుత్ దీపకాంతులతో ముస్తాబైంది రేపు ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈవో లవన్న అర్చకులు, వేదపండితులు శ్రీకారం చుట్టనున్నారు…..
బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇలా….22 ఉదయం యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభం సాయంత్రం ధ్వజారోహణ
మరుసటి రోజు నుండి స్వామి అమ్మవారి వివిధ వహనసేవలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు
23 వ తేదీన భృంగి వాహనసేవ,
24 వ తేదీన హంసవాహనసేవ,
25 వ తేదీన మయూరవాహనసేవ
26 వ తేదీన రావణవాహన సేవ
27 వ తేదీన పుష్పపల్లకీ సేవ
28 వ తేదీన గజవాహనసేవ
మార్చి 1 వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం ప్రభోత్సవం,నందివాహనసేవ
రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం పాగాలంకరణ స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహణ
మార్చి 2 వ తేదీన రథోత్సవం తెప్పోత్సవం
మార్చి 3 వ తేదీన యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
మార్చి 4వ తేదీన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగింపు..