ఇసుక దందాకు విద్యార్థుల భవిష్యత్తు ఫణంగా పెడుతారా?
వైసీపీ పాలనలో ఇసుక మాఫియా మూడు పువ్వులు, ఆరు కాయాలు మాదిరిగా మారింది. జగన్ రెడ్డి ఏ ముహూర్తానా ఏపీలో పాలన పగ్గాలు చేపట్టారో కానీ.. నాటి నుంచి ఇసుక మాఫియా అధికారపార్టీకి పాలిట బంగార గనిగా మారింది. ఇసుక బ్లాక్ చేసి, వేల కోట్లు గడించవచ్చునని భావించిన జగన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నారు. ఇసుక సరఫరాపై తెచ్చిన ఆంక్షాలు అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో రెండు గ్రామాలు మధ్య నెలకొన్న ఇసుక పంచాయితీ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తవ్వుకుని తీసుకెళ్లేందుకు వీలు లేదని గ్రామస్తులు నిలదీస్తుంటే.. మా గ్రామంలో మీ పిల్లులు చదవడానికి వీల్లేదని వేరొక గ్రామం వారు విద్యార్థులను నిలేశారు. ఇదిక్కెడి విష సంస్కృతేమో కానీ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు.
మా ఊరి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి!
విజయనగరం జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయితీ తీవ్ర ఘర్షణలకు దారి తీస్తోంది. ఈ ఇసుక పంచాయితే పిల్లల చదువులపై పడుతోంది! జిల్లాలోని పూసపాటిరేగ మండలంలోని లంకలపాలెం, గోవిందపురం గ్రామాల మధ్య ఇసుక వివాదం తారా స్థాయికి చేరింది. అది కాస్తా.. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయ్యడమేకాకుండా, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది. లంకలపాలెం సమీపంలోని తంగవలస గడ్డ నుంచి గోవిందపురం వాసులు ఇసుకను తరలిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఈ ఇసుకను ఉపయోగిస్తున్నారు. తమ గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని లంకలపాలెం వాసులు ఆరోపిస్తూ, అభ్యంతరాలు తెలిపారు. దీంతో ఇరు గ్రామాల వద్ద నెలకొన్న వివాదం పెద్దదయ్యింది. ఇసుక తరలించడానికి లంకలపల్లికి చెందిన గ్రామస్తులు అడ్డుకోగా.. మా ఊరు పాఠశాలలో లంకలపల్లికి చెందిన విద్యార్థులు చదివేందుకు వీల్లేదని గోవిందపురం గ్రామస్తులు హుకుం జారీ చేశారు. దీంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో ఇరు గ్రామాల్లో మోహరించారు.
Must Read:-జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్టీటీ షాక్ ..! ఆ మూడు రిజర్వాయర్ల పనులు ఆపండి!!











