హనికరంగా ప్రభుత్వ మద్యం.. తాగితే చస్తారు!
ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో సంపూర్ణ మద్యపాన నిషేద హామీ .. నేడు వికృత చేష్టలకు దారితీస్తోంది. మద్యం ధరలను పెంచి మందుబాబుల నడ్డివిరవడం ఒకెత్తయితే… నాణ్యమైన, నిత్యం తాగే బ్రాండ్స్ తీసేసి, కనీవినీ ఎరుగని మద్యం కంపెనీ బ్రాండ్స్ అమ్మకాలు జరపడం మరోక దారుణం. స్వార్థపూరిత ఆలోచనలు నిత్యం మందుబాబులు సేవించే బ్రాండ్స్ ను తీసిస్తే, ప్రభుత్వం ధరలను రెట్టింపు చేసి.. ఆదాయాన్ని పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేలా చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు ఏటా మన మద్యం ఆదాయం దాదాపు రూ. 40 వేల కోట్లు తరలి వెళ్తుందని సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ ఆదాయం అక్కర్లేదు అనుకుంటే ..సంపూర్ణ మద్యపానం నిషేదం విధించండి.. పేద, మధ్య తరగతి కుటుంబాలు బాగుపడుతాయని విమర్శలు వినవస్తున్నాయి. మద్యపానం నిషేదం అన్న మాట దేవుడెరుగు .. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు వెలిశాయి. ఆ బెల్ట్ షాపుల్లోనే తెలంగాణ, కర్నాటక, తమిళనాడు మద్యం దర్శనమిస్తుంటుంది. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ బెల్ట్ షాపుల నిర్వహాకులు కూడా అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలేనన్నది బహిరంగ రహస్యమే! ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా తెనాలిలోని నందులపేటకు చెందిన కిషోర్ అనే యువకుడు ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మద్యం బాటిల్ ను కొనుగోలు చేశాడు. మద్యం సీసాను పరిశీలించకుండా సేవించాడు. ఆ తరువాత వాంతులు, నీళ్ల విరోచనాలు పట్టుకున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు మద్యం సీసాను గమనిస్తే అందులో చెత్తచెదారం, పురుగులు దర్శనమిచ్చాయి. మద్యం సీసాతో దుకాణం వద్దకు వెళ్లి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనినిబట్టి మందు బాబులు ఏపీలో మద్యం సేవించాలంటే తప్పనిసరిగా మద్యం సీసాను ఒకటికి రెండు సార్లు గమనించి, సేవిస్తే సో బెటర్ అంటూ వైద్యులు సలహాలిస్తున్నారు.
Must Read ;- అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్న ఏపీ ప్రభుత్వం!!











