మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు ఈసారి ఘనంగా జరగబోతోంది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు. రామ్ చరణ్ అభిమానుల కోసం గత ఏడాది ఇదే రోజున రాజమౌళి మంచి విజువల్ ఫీస్ట్ అందించారు. భీమ్ ఫర్ రామరాజు అంటూ ఎన్టీఆర్ తో మంచి పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించారు. మరి ఈసారి రాజమౌళి ఎలాంటి సర్ ప్రైజ్ చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పైగా ఈ ఏడాదే ట్రిపుల్ ఆర్ కూడా విడుదల కాబోతోంది. దాంతో పాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్న ‘ఆచార్య’కూడా జనం ముందుకు రాబోతోంది.
ఈసారి అంత పవర్ ఫుల్ గా రాజమౌళి ఏంచేయబోతున్నారన్న ఆసక్తి రామ్ చరణ్ అభిమానులో ఉంది. అసలు ఈ పుట్టిన రోజుకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే సందడి మొదలైంది. రాజ్ మౌళి కూడా ఈసారి ఏంచేయబోతున్నారో ఆ అప్ డేట్ కూడా ఇచ్చేశారు. ఒక పవర్ ఫుల్ ఫైర్ కాస్ట్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ట్వి్ట్టర్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఫైర్ కాస్ట్ పోస్టర్ అనే పేరు ఘనంగానే ఉన్నా ఇది ఎలా ఉంటుందన్న ఆసక్తి కూడా అందరిలోనూ ఉంది. అలాగే మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు కూడా ఉంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి అనేక అప్ డేట్స్ వచ్చేశాయి. సినిమా విడుదలయ్యే లోపు ఇంకెన్ని అప్ డేట్స్ వస్తాయో చూడాలి. రామ్ చరణ్ పుట్టిన రోజున ఆయన రాబోయే సినిమాల అప్ డేట్స్ కూడా దండిగానే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు ప్రాజెక్టులు అధికారికంగా తెలుసు. మిగతావి చర్చల దశలోనే ఉన్నాయి.
Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ లో అందాల సీత గా ఆలియా భట్
Unleashing @AlwaysRamCharan's FIERCEST avatar as Ramaraju for his birthday with a new poster! 🔥🔥#RRRMovie
RAMA RAJU aRRRiving
— RRR Movie (@RRRMovie) March 20, 2021