టాలీవుడ్ లో వరుస విజయాలతో జోరుమీదున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. స్టార్ హీరోలందరూ ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి కరోనా క్వారంటైన్ లో ఉన్నప్పటికీ.. ఆయన తదుపరి చిత్రాల మీద అప్టేడ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ తో ‘ఎఫ్ 3’ చిత్రం తెరకెక్కిస్తోన్న అనిల్ రావిపూడి.. తన తదుపరి చిత్రాన్ని రామ్ పోతినేనితో చేయబోతున్నాడట. ఆ మేరకు ఇప్పటికే వీరిద్దరి మధ్య స్టోరీ డిస్కషన్స్ నడిచాయని తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఈ ఇద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతోందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది వీరి కలయికలో ఖచ్చితంగా సినిమా ఉంటుందని సమాచారం.
అనిల్ రావిపూడి చెప్పిన కథాంశం రామ్ కి చాలా బాగా నచ్చిందని .. ఆయనతో సినిమా చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. వరుసగా స్టార్ హీరోలతో కామెడీ కామెడీ సినిమాలు తీస్తూ అజేయంగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడికి .. రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ దొరికితే .. ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ కాంబో పై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.