బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రుటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు. ప్రస్తుతం ఆయన ‘బజార్ రౌడి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో క్లైమాక్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదరం జరిగింది. హృదయకాలేయం, కొబ్బరిమట్ట చిత్రాల ద్వారా సంపూ అందరికీ సుపరిచితమే. తాజాగా ఆయన బజారు రౌడీ అనే సినిమా చేస్తున్నారు. వసంత నాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు బైక్ ను పైకి లేపి సంచుల మీద నుంచి దూకాల్సి ఉంది.
ఆ సీన్ చిత్రీకరిస్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడింది. సంపూర్ణేష్ కు ఏమీ కాలేదు. ఇటీవలే ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో ఓ పాటను కూడా చిత్రీకరించారు. హైదరాబాద్ శివారులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. క్లైమాక్స్ చిత్రీకరణంలో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ నిలిపివేశారు. సంపూర్ణేష్ కు ఎలాంటి గాయాలూ కాలేదని చిత్రయూనిట్ తెలిపింది.
Also Read:-టాలీవుడ్ లోకి మరో పవర్ స్టార్ ఎంట్రీ.. !











