ఓ వైపు తమిళంతో పాటు ఇతర బాషలలో నటిస్తూ తెలుగు ఆఫర్ల కోసం సనమ్ షెట్టి ఎదురుచూస్తోంది. ఇప్పటికే తెలుగులో సంపూర్ణేష్ బాబు సరసన “సింగం 123” చిత్రంలో మెరిసిన ఆమె ఆ తర్వాత “ప్రేమికుడు” చిత్రంలో హీరో మానస్ కు జోడీగా నటించింది. ఈ రెండు చిత్రాలు అనుకున్నంతగా ఆమెకు పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళ సినిమాలు చేస్తోంది
. ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం. తెలుగులో మళ్లీ అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తూనే హాట్ హాట్ ఫోజుల ఫోటోలను షేర్ చేస్తూ ఆ రకంగా టాలీవుడ్ దృష్టిలో పడేందుకు ఆమె ప్రయత్నిస్తోంది అని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.
Must Read ;- ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!