నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రావడం లేదు. బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు నేనే చెబుతాను. ఇంకా టైమ్ ఉంది అని చెప్పేవారు. అయితే.. మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకుడు అంటూ ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి పేరు వినిపించింది. ఆతర్వాత విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ పేరు గట్టిగా వినిపించింది.

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో మోక్షజ్ఞ ఓ చిన్న పాత్ర చేయనున్నారని టాక్ వినిపించింది. తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో మోక్షజ్ఞ నటించడం కుదరలేదు. మోక్షజ్క్ష ఫస్ట్ మూవీకి క్రిషే డైరెక్టర్ అంటూ టాక్ వినిపించింది. ఇది కూడా జరగలేదు. ఆతర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎలాంటి వార్తలు రాలేదు. మళ్లీ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ వార్తల్లో నిలిచింది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మోక్షజ్ఞ కోసం ఓ స్టోరీ రెడీ చేసారని సమాచారం. బాలయ్య కథ విని ఓకే చెప్పారని… అంతే కాకుండా బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న ఈ చిత్రాన్ని అఫిషియల్ గా ఎనౌన్స చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. హీరోలను ఎలా చూపించాలో.. పూరికి బాగా తెలుసు. అందుచేత మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి పూరి డైరెక్టర్ అయితే నందమూరి అభిమానులకు పండగే. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా.? కాదా.? అనేది తెలియాల్సివుంది.
Must Read ;- చిరు బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ











